పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xlviii


చెప్పెను. అన్నిటికిని ఉదాహరణములను చెప్పి తన సామర్థ్యమును చూపుటకై సర్వప్రాస కందమును చెప్పినాడు.

క. కుండలి బాలకులకు నధి
   కుండగు భుజగేంద్రనాయకుండటు మెచ్చం
   గుండ యమృతంబు నేఁడీ
   కుండఁగఁ దగదనుచుఁ దప్పకుండఁగ నిచ్చెన్.” (9-139)

   గోపరాజు వలపలగిలక ప్రాసమున గూడ పద్యము చెప్పినాడు.

శా. కాశ్యపిలోఁబ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముడం
    గశ్యపగోత్రజాతుఁ డ, వికార విదూరమనస్కుఁడన్ జగ
    ద్వశ్యకళావిశారదుఁడ, దైవము చెయ్ది దరిద్రభావనా
    కార్శ్యమునొంది ఖార్య గడుఁ గష్టపుఁ బల్కులు వల్కనోర్చితిన్. (8-206)

ఇట్టిది 'సంయుక్త విశేషప్రాస' కాదగునని శ్రీ రావూరి దొరస్వామి శర్మగారు చెప్పిరి. [1] గోపరాజు, ప్రమాదమున గావచ్చును ప్రాసభంగమును చేసినాడు.

"నీ కే వాంఛయు లేకయున్న వినుమా నిన్నెవ్వఁడీక్షించినన్
 మాకిష్టంబు సరస్వతీవిభవ మామర్త్యుండు వే పొందు వా
 క్ప్రౌఢుండై విలసిల్లఁ జేసెదము భూపాలాగ్రణీ నీయశం
 బాకల్పంబుగ నొప్పుఁగాత జనలోకానందమై సాంద్రమై." (12-106)

ఇందలి మూడవపాదమును “వాక్ఛ్రీకుండైవిలసిల్లఁ జేసెదము ధాత్రీనాయకా"అని సవరింప వచ్చును; కాని స్వతంత్రించుట న్యాయముకాదు.

  1. అప్పకవీయ భావప్రకాశిక.