పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

425


చ.

అని వినయోక్తిగాఁ బలికినంతనె కర్మము బుద్ధియుం గడం
కను దెరు వేది మాకనుచుఁ గైకొని యొక్కటి యౌచు నిర్ణయం
బునకుఁ బణంబుగాఁ గడుఁ బ్రమోదముతో నమృతంబు దెచ్చి పో
సిన నతికాంతిగా నతని చేయును గాలును వచ్చెఁ జెచ్చెరన్.

151


ఉ.

ఈగతి బ్రోచి వారు సన నీవల బాలిక యేగి హస్తపా
దాగమనప్రకారము ప్రియంబుగఁ దండ్రికిఁ జెప్పె నాతఁడు
న్వేగమ వచ్చి యల్లుని నవీనరతిప్రియుఁ జూచి యాత్మపు
త్రీగుణభాగ్యసంపద నుతించుచుఁ గౌఁగిటఁ [1]జేర్చె నాతనిన్.

152


చ.

అతనిచరిత్రముం దెలిసి యత్యనురాగముతో నతండు దా
సుతరహితుండు గానఁ దనక్షోణికి నాతని రాజుఁ జేసిన
న్మతి నతిహృష్టుఁ డౌచు మతిమంతుఁడు తత్పురి యేలుచు న్నిజ
క్షితి కరుదెంచి మంత్రికులసేవితుఁడై సిరు లొందెఁ గావునన్.

153


క.

నీవెరవును నావెరవును
దైవగతిం గాని కొనదు దయ గలిగిన నా
త్రోవల నాడుచు నుండఁగ
నీ వర్థముప్రాపు గమ్ము హితభావమునన్.

154


సీ.

నావుడు నట్లకాఁ గావింతు నూఱడు
        మని వాని ననిపిన యవసరమునఁ
బరదేశు లిద్దఱు భాషించుచో నొకఁ
        డిల యెల్లఁ గ్రుమ్మరి యింద్రకీల
నగముపై నున్న మనస్సిద్ధి యనుదేవిఁ
        జూడ మైతిమి విశస్తులము మనము
అష్టదిక్కుల నున్న యష్టభైరవులకు
        నష్టాంగరుధిరంబు లర్చనముగఁ

  1. జేర్చెఁ జచ్చెరన్