పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

424

సింహాసన ద్వాత్రింశిక


బుద్ది ఘనమొ కర్మము ఘనంబొ చెప్పుమా
యేను బుద్ధిఁ గర్మ మీతఁ డనిన.

144


వ.

అతఁడు విని బుద్ధికర్మంబుల కిట్లనియె.

145


ఉ.

ఎంతటివాఁడ నేను దివిజేంద్రునియానతి నన్నుఁ గూర్చి మీ
యంతటివారు వచ్చినఁ గృతార్థుఁడ నైతి ఫలానువృత్తి మీ
పంతము మీ రెఱుంగరె శుభం బశుభంబును గూడి చేయుచోఁ
గొంతయుఁ గీడు లే దుభయకూటము గాదె ఫలంబు పట్టునన్.

146


ఆ.

బుద్ధిదేవి నీవు పొందుగా [1]నిలువక
కర్మఫలము లెట్లు గదియు నైనఁ
దండ్రి కర్మ మీవు తనయవు మీతండ్రి
యెక్కు డైన నీకు నేమికొఱఁత.

147


క.

దుర్మార్గునకును బుద్ది స
ధర్మునకును విధికృతంబు తప్పదు “బుద్ధిః
కర్మానుసారిణీ" యను
మర్మము చెప్పుదురు నీకు మఱి యొక తెరువా?

148


క.

మును బుద్ది ద్రోవఁజాలని
నను దృష్టాంతముగ నమరనాయకుఁ డిటకుం
బనిచే ననుఁ జూడ జగడము
పనిలే దని యొడఁబడంగఁ బలికి వినతుఁడై.

149


ఉ.

చే టటుదప్ప లక్ష్మి నిరసించి వనంబున మౌనినైనచో
నాటునఁ గాలుఁ జేయిఁ జనునాపదఁ బ్రాణము తీపినుంట నీ
జోటియు వెంట వచ్చుటయుఁ జూడ నయుక్తము లైన వింక నే
పాటులఁ బెట్టఁ జూచెదవొ. బాపు, విధీ! నిను మీఱవచ్చునే.

150
  1. విడ్వడ, విడ్వక