పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

423


యిష్టభోజనమునఁ దుష్టి గావించి యా
కొమ్మ తన్ను నతనిసొమ్ముఁ జేసె.

139


వ.

అంత.

140


క.

వెఱ పుడిగి యతఁడు రతికళ
లెఱుపడంబొదలుతివుట హృదయము గరఁగన్
నరకంబడియును జవిగల
చెఱకుక్రియం దీపులుట్టఁ జెలువం గలసెన్.

141


వ.

ఇట్లు కలసి సతిపతు లుండునంత.

142


క.

ఒకనాఁటిరాత్రి తేజ
ప్రకటాకృతు లిద్ద రనిలపథమున డిగి మే
డకు వచ్చి నిలిచి రాబా
లిక పతిపానుపుననుండి లేచి తలంగన్.

143


సీ.

నిలిచిన వారి యుజ్జ్వలదివ్యతేజంబు
        చూచి దిగ్గనఁ దాను లేచి యచట
నిద్దఱఁ గూర్చుండ నిడి యర్చనము లిచ్చి
        యేల విచ్చేసితి [1]రెవ్వ రనుడుఁ
గార్యంబు నాచేత ఘటియించు విఘటించు
        నీ వెంత తా నెంత నిలువుమనుచుఁ
గలహంబు బుద్ధికి గర్మంబునకు నైన
        నింద్రుండు మాన్పించి యిటకుఁ బుచ్చె


ఆ.

నీవు నిర్ణయింపు దేవేంద్రునానతిం
ద్రోవరాదు శిక్షితుండ వీవు

  1. రెవ్వ రేమి, కార్యంబు నాచేత ఘటియింపఁగా మదిఁదలఁచి వచ్చితి రది తెలుపుమనిన