పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422

సింహాసన ద్వాత్రింశిక


క.

చూచి తను మఱచి పైబడఁ
జూచిన నాదాది నిలిపి క్షోణీపతికిన్
నీచందము చెప్పి తదా
జ్ఞోచితగతి నితనిఁ గూడు టొప్పుఁ గృశాంగీ.

133


వ.

అదియునుం గాక.

134


క.

మును నీవు స్వయంవరమున
కని డాచిన కనకమాలికాభరణం బీ
తని ముట్టి వచ్చెఁ గావున
నొనరినపతి యితడె కాఁగ నొప్పుం బదమా.

135


చ.

అని మగిడించినం దిరిగి యంతిపురంబు కేగి మీనకే
తనుఁ డభిమానముం దగవుఁ దాల్మియు సిగ్గు నడంపఁ దెంపునన్
జనకుని వేడి నీవు ననుఁ జంపినపాపము నొందువాఁడ వీ
పని కెడచేసితే ననుచుఁ [1]బ్రార్థన యేర్పడఁ జేసి మ్రొక్కినన్.

136


మ.

అకటా పేరును బెంపు సొంపు నతిరమ్యాకారముం గల్గువా
నికి నే నిచ్చెద నంచు గారవముతో నిన్నుంప నీ విట్లు వం
శకళంకం బొనరించి తీవు మొద లెంచం గోర వీమొండివా
నికి మోహించితి మాకుఁ జిచ్చిడితివో నీవేల మేమేటికిన్.

137


క.

అని పదరు టియ్యకోలుగఁ
జని సఖులును దాను వెఱపు సమయించి ప్రకా
శని మతిమంతుని దోడ్కొని
తనమేడకుఁ [2]దెచ్చెఁ బ్రజలు దను నవ్వంగన్.

138


ఆ.

తెచ్చి జలకమార్చి దివ్యాంబరంబులు
గట్టనిచ్చి మంచిగంద మలఁది

  1. బ్రార్థన నేర్పడఁ జెప్పి మ్రొక్కినన్
  2. నేగె