పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

421


పాటిగుడిసె యొక్కచోటఁ గట్టించి యం
దునిచి దినము నరయుచున్న నతఁడు.

129


క.

[1]తనజన్మ ఫలము దప్పునె
తను వెడలినమీఁదనైనఁ దప్పదు నేఁ డీ
యనుభవమునఁ దీర్చెదనని
మనమునఁ దలపోసి యాత్మమరణం బుడిగెన్.

130


శా.

ఆవైశ్యోత్తము ప్రోపునన్ బ్రదికి పుష్టాకారుఁడై రాత్రి నా
నావైచిత్రి ననేకరాగముల గానం బింపుగాఁ జేయఁగా
దేవస్త్రీక్రియ మేడనున్న నృపపుత్రీరత్న మాలించి కా
మావేశంబు భజించి దాది నటకుం [2]బ్రార్థింపఁ బుత్తెంచినన్.

131


సీ.

అది వచ్చి యాతనియాకార మీక్షించి
        మది రోసి క్రమ్మఱ సుదతిఁ జేరి
యిలఁగల రాజపుత్రుల నెల్ల మెచ్చక
        యుండి నీ నిప్పు డామొండివానిఁ
దెమ్మని పుచ్చితి కొమ్మ నీ వెఱుఁగవు
        నగుఁబాటు గాకున్నె జగములోన
ననవుడు నమ్మక యాబాల తానభి
        సారికాకృతి గూఢచారి యగుచు


ఆ.

వచ్చి చూచి దుఃఖవహ్నిచేఁ గ్రాఁగుచు
దెలివి సెడక దేహదీప్తి మెఱయ
నఱకఁబడిన పసిఁడితెఱఁగున నున్న యా
ధీరచిత్తుని జయదేవసుతుని.

132
  1. జననఫలముదప్పునె యీ
  2. బ్రార్థించి-న్నర్ధించి