పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

415


ప్పకయిత్తురుఁ గొంద్రనువరు.
లకటా జూదంబులోన ననృతము గలదే.

100


ఉ.

ఆట జయంబుఁ జేకొనిన నర్థము చేకుఱు దాన మేటిగా[1]
నోటమిఁ జిక్కి ద్రవ్య మిడనోపని పేదల కడ్డమౌచు మా
ఱాట భజింప ధర్మ మగు నంతన మోక్షము గల్గుఁ గావునం
దోటికిఁ జూచువార లిది దుర్వ్యసనం బన నమ్మవచ్చునే.

101


ఉ.

హితభావంబున బుద్ధి చెప్పితివి నాకిష్టంబుగా దాట సం
తతము న్సంతస మందఁజేయు నొకచో దైవంబు దప్పించినన్
మతి వేఱొండుల కెక్కునే ధనము సంపాదించెఁ బూర్వంబున
న్మతిమంతుం డను రాజు బుద్ధిఁ జని సన్మానంబుతో నుండెనే.

102


మతిమంతుని కథ

ఉ.

నావుడుఁ దత్కథావివరణంబునకుం జెవి యాని భూవరుం
డావిధ మేర్పడం దెలుపుమన్న దురోదరశీలుఁ డిట్లనున్
దేవసమానుఁడైన జయదేవుఁడు నా ధర యేలుచుండె ర
త్నావళిసంజ్ఞ నొప్పిన మహానగరంబున ధర్మశాలియై.

103


చ.

అతనికిఁ గాంతిరేఖ యనునంగనకుం బ్రథమాంశగణ్యుఁ డౌ
సుతుఁ డుదయించి బాలుఁ డగుచు న్నయశాస్త్రము లాగమంబులుం
గృతులుఁ బఠించి యోగములకీ లొకయింత యెఱింగి సర్వస
మ్మతమగు నేర్పుకల్మి మతిమంతుఁడునాఁ బరఁగెం బురంబునన్.

104


మ.

అతికాలంబునఁ బెద్దయై నృపుఁడు పుణ్యారణ్యవాసంబు ప్ర
స్తుతమైన న్నయభూషణుం డను నమాత్యుం బిల్చి తత్సమ్మతి
న్సుతునిం బట్టము గట్టి యేగె నట నస్తోకప్రభావాఢ్యుఁ డౌ
మతిమంతుం డిట యేలుచుండెఁ దనసామ్రాజ్యంబు పూజ్యంబుగన్.

105
  1. దానగామమా- దానదానగాదు పేరోటమి