పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

410

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

పూతచరిత్రు సాహసవిభూషణుఁ బోలఁ జరించుచోట దుః
ఖాతురుఁ డైనవాఁడు తనకబ్బినయీగికిఁ బాత్రుఁ డంచు నే
జాతివిభేదము న్గుణవిచారము సేయక యిచ్చునట్టి యా
దాతృగుణంబు లేక వసుధావర నీ కిది యెక్క శక్యమే.

78


శా.

పాత్రాపాత్రవివేక మంచు ధనలోభం బెక్కడంజేయు నీ
ధాత్రి న్నీతులు గల్గుఁ గాగ ఘనచింతాఖిన్నుఁ డౌవాఁడె స
త్పాత్రుం డంచు నెఱుంగు టొప్పు ననుచుం దత్కాలదానంబుల
న్మిత్రత్వంబు వహించు సర్వజనులు న్మెచ్చంగ వాఁ డెల్లెడన్.

79


మ.

వివరింతు న్విను తద్గుణంబు లఖీలోర్వీనాథసంసేవ్యుఁ డ
య్యవనీపాలకుఁ డొక్కరుండ పరదేశాలోకనాసక్తి యు
త్సవమై సొంపు నటింపఁ గ్రుమ్మరుచుఁ బ్రాసాదోజ్జ్వలం బైన చం
ద్రవతీదుర్గము గాంచెఁ [1]గాంచికి సమానంబై వెలుంగొందగన్.

80


ఉ.

ఆపుర మద్రిమీఁద వివిధావరణంబు ననేకలోకసం
దీపితమధ్యమం బనుగతిప్రకటికృతసోమసూర్యవీ
థీపరిణాహరమ్యము నతిస్థిరభూభృదుపాశ్రయంబునై
శ్రీపతియాజ్ఞనుండు నది రెండవయజ్ఞభవాండమో యనన్.

81


ఉ.

ఆనగరంబు సొచ్చి నవహర్మ్యనిరంతరరమ్యవాటికం
బైనవణిక్పథంబున ననంతసువస్తుసమూహదర్శనే
చ్ఛానిరతిం జరించి మణిసంఘటితంబగు నొక్కదేవతా
స్థానముఁ జేరి భిక్షుకువిధంబున నచ్చట విశ్రమింపఁగన్.

82


సీ.

చెంగావి వలిపెంబుఁ జెలువార ధరియించి
        చలముగా మేన గంధంబుఁ బూసి

  1. గాంచి కెనయై రాజిల్లుచు న్నుండగన్