పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

405


నొక్కపెట్టునఁ బ్రజ నుర్విఁ గూలఁగఁజేయు
        కాలదండాకృతి వాల మెసఁగ
మదిఁ గ్రోధవహ్నికి మొదలైన
        నిప్పులపెంపునఁ గన్నుల [1]కెంపు గదుర


ఆ.

బ్రణుతవీరరసము పట్టినకడవనా
దనరు రౌద్రరసము దాన యగుచు
[2]నవని మ్రింగుమాడ్కి నావులించెడు మహా
వ్యాఘ్రమొకటి కానవచ్చె నెదుట.

52


క.

కని దీని నెత్తఁ దోడ్పడు
మనుజుని దలఁపంగఁ బసులమారియె వచ్చె
న్మును గండమాలమీఁదను
మొనకురుపుం బుట్టె నన్న మోసంబాయెన్.

53


చ.

ఇది కడు దుస్తరం బనుచు నెంతయు నాతురుఁ డైన నంతలోఁ
జెదరక బంటుమీఁదఁ బరజించుచు డగ్గఱుశూరుకైవడిం
బదములచప్పు డేర్పడనిబాగునఁ బొంచి చలించి వాలమున్
వదనము చేయి నెత్తుకొని వ్యాఘ్రము పైఁబడియం గడిందిగన్.

54


క.

పడునెడ నడ్డముసొచ్చిన
పుడమివిభుం గదిమి యెడమభుజ మడిచెఁ ననుం
బొడగనియుఁ బొడుచు టెఱిఁగియు
జడియఁ డనుచుఁ బొగడి చేతఁజఱచినమాడ్కిన్.

55


ఆ.

పెడమరించి యతనిఁ దొడరక యాపులి
మిత్తిభంగిఁ గుఱ్ఱిమీఁది కుఱికి

  1. కెంపు దేర
  2. నవని బీటవెట్టి యావులించెడు