పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

404

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

మిత్రుఁ డరిగిన యెడ శత్రువునై యిట్లు
గాసి వెట్టిన మదిఁ గలఁగఁ డితఁడు
ధర్మశీలునెదురఁ దామసగుణములు
నిలువ వనుచు రజని తలఁగిపోయె.

47


శా.

ప్రత్యూషం బగునంత వాన వెలిసెం బ్రవ్యక్తమై దిక్కులం
దత్యాభాసము గల్లె జక్కవకవల్ హర్షించెఁ జీఁకట్లు దే
శత్యాగంబుగఁ బాసెఁ దమ్ములు వికాసం బొందఁ బూర్వాద్రి నా
దిత్యుం డుద్గతుఁ డయ్యెఁ గుంకుమగతిం దేజంబు రాజిల్లఁగన్.

48


క.

పక్షులు వలుకుచుఁ దమతమ
పక్షము లగువానిఁ గూడి బాలార్కురుచిం
బక్షంబులు కెంపడరఁగఁ
బక్షీంద్రునిపిల్ల లనఁగఁ బాఱం దొడఁగెన్.

49


ఉ.

అప్పుడు విక్రమార్కుడు ప్రయాసము వుట్టఁగఁ దోఁకవట్టి తా
నెప్పటి యట్ల పూనికొని యెత్తఁగ ధేనువు లేవకున్న నే
చొప్పు నెఱుంగలేక యిది చూడఁగ సన్నము చాల వ్రేఁగు నా
కప్పరమేశుఁ డిచ్చిన మహాబల [1]మెక్కడ స్రుక్కె నక్కటా.

50


ఉ.

కొమ్ములు పట్టి యెత్తఁ బథికుం డొకఁ డైనను గల్లఁ డిట్టి ఘో
రమ్మగుకానలోపల నరప్రసరం బది యెట్లు గల్గు నా
యిమ్ముల యత్న మేల ఫలియించుఁ బురాకృతవృత్తినైన భా
గ్యమ్మునఁ గాక యంచు మదిఁ గందుచు ముందఱఁ బాఱఁ జూచినన్.

51


సీ.

[2]గజములం తేసి మృగంబులఁ
        జెండాడుగోరు లంకుశముల కొలఁదిమీఱఁ
జాఱలు తనచేతఁ జచ్చినజీవుల
        లెక్కబొట్టులక్రియ నక్కజముగఁ

  1. మిక్కడ
  2. గజములయంతమృగ