పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

403


మిన్ను వచ్చి నేలమీఁద వ్రాలిన యట్లు
దెసలఁ జీకువాలు దీటుకొనియె.

43


క.

పగలు బయలనుండక కొం
డగుహలలోఁ జొచ్చుకొని యడంగి దినాంతం
బగుదడవె వెడలె గూబలు
నిగుడం [1]జీఁకట్లు పోలె నీలాకృతులై.

44


సీ.

అప్పుడు చీఁకట్ల కుప్పలచొప్పున
        ఘుమఘుమధ్వనుల మేఘములు వొడమె
నందుల మెఱపు లయ్యంజనాచలభూమి
        దావాగ్నిశిఖల చందమున మెఱసెఁ
బెల్లుగాఁ బెటులు పెఠిల్లున మ్రోయుచుఁ
        బిడుగులు తొడితొడిఁ బడియెఁగడల
రువ్వున వడినెడ త్రెవ్వనిగాలితో
        గవుకులంతలు చిన్కు లవనిఁ దొరఁగెఁ


గీ.

బిదప నెత్తుగ బోరునఁ బెద్దవాన
కడవలను గ్రుమ్మరించిన వడుపు దోఁపఁ
గురియుచుండంగ వఱదలు గ్రుంత మిట్ట
లొక్కకొలఁదిగఁ బాఱె నీ ళ్ళక్కజముగ.

45


శా.

ధారాపాతజలాతిశీతఘనవాతక్లిష్టమౌ వృష్టిలో
నారాజన్యుఁడు [2]గోవుడించి చన నన్యాయం బటంచు న్మహా
ధీరుండై తనబొంత గప్పె నిజశస్త్రీదత్తసాహాయ్యుఁడై
యారే యెల్లను దానె మాటగుచు ధర్మాసక్తితో నిల్పఁగన్.

46
  1. జీఁకట్లయట్లు
  2. కుఱ్ఱిడించి, ధేనుడించి