పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

402

సింహాసన ద్వాత్రింశిక


చ.

అట విని యిట్టి కాఱడవి నద్భుతమైనది ధేనుఘోష ము
త్కటమదపుండరీకహరిగండకసంకుల మైనచోటి క
క్కట పసు లెట్లు వచ్చె విధికల్పన చూచెద నంచు నేగి ముం
దట గిరిపొంతఁ గొంతయెడ దవ్వుల రేగడ వెంచలోపలన్.

38


ఆ.

నాల్గుకాళ్ళు రొంపి నాటిన నుంకించి
వెడలి రాఁగడంగి వెడల లేక
దీనవదన మైన ధేనువుఁబొడఁ గని
యతిదయాళుఁ డయ్యె నవనివిభుఁడు.

39


చ.

అనువగువేళ డగ్గఱన యాయతిథిం, జెఱనున్న భూమిదే
వునిఁ, గడురొంపిఁ బడ్డ పశువున్, వ్యసనాతురుఁ డైన యేలికం,
దన పగవారు గొన్న బిరుదంబున దుఃఖితుఁడైన మిత్రునిన్,
ఘనబలుఁ డయ్యుఁ గైకొన నికష్టునిఁ జూడఁగనోడుఁ గాలుఁడున్.

40


ఆ.

ఆనుచు వెంచ సొచ్చి తనకాళ్ళు గట్టిగాఁ
బెట్టి తోఁకమట్ట పట్టి యెత్త
జట్టుభంగి రొంపి పట్టును వీడక
మొదవు కొంతయైనఁ గదలకుండె.

41


క.

[1]ఆయవసరమున ఘన మగు
నాయావు నటెత్తలేక యలసగతుండౌ
నాయకుని జగము గని నగు
నోయని వెలుఁ గుడిగెనన నినుం డటఁ గ్రుంకెన్.

42


గీ.

మెట్టు గట్టుఁ జెట్టు మిఱ్ఱును బల్లము
బయలు ననుచు నేరుపఱుపరాక

  1. ఆయవసరమున నాఘనుఁ, డాయావును— ఘనుఁడై యాయావును