పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

400

సింహాసన ద్వాత్రింశిక


దీపితదివ్యశస్త్రనిహతిన్ దిననాథతనూజవక్ర మా
ర్గాపఘనోపరోధ మభయంబునఁ జేయుము వృష్టి గల్లెడున్.

25


ఉ.

పంటలు పెక్కుగల్గు నని పల్కిన నానృపుఁ డాత్మలోన ము
క్కంటి రఘూద్వహు న్విజయుఁ గైకొని మ్రొక్కుచు దివ్యబాణము
ల్వింట నమర్చి పంక్తిరథులీలఁ గడంగి ప్రతాపశక్తి మి
న్నంటి గ్రహంబు లెల్ల విరియంగ శనైశ్చరు నడ్డకట్టినన్.

26


ఉ.

ఆశని నిల్చి నీబలమహత్త్వము మెచ్చితిఁ దొల్లి నీవు గౌ
రీశునిచేఁ దపంబున నభీష్టము లందితి, నేఁడు శక్తి నా
[1]కాశము గట్టి నాదగుప్రకాశము ద్రుంచితి నేఁటినుండి నీ
దేశములోపలం గఱవు దీఱఁ బ్రజ ల్సుఖియింపఁజేసెదన్.

27


శా.

హర్షం బయ్యె భవత్కృతంబున నృపాలాగ్రేసరా కోరిన
న్వర్షంబు ల్గురియింతు నెప్పుడయిన న్వర్ధిల్లు పొమ్మన్న ను
త్కర్షంబంటిన శౌర్యమొప్పఁగ సుభిక్షం బుర్విఁ దోఁపంగ దు
ర్ధర్షుండై [2]చనుదెంచి భక్తిఁ గొలిచెన్ ధాత్రీశుఁ డాశాపురిన్.

28


వ.

అది గావున.

29


క.

ఈసామర్థ్యము [3]నీకడ
వీసంబును లేదు మగిడి వెసఁ జను మనినన్
వేసరినభంగి భోజుం
డాసింహాసనము డిగి గృహంబున కరిగెన్.

30


వ.

తదనంతరంబ కతిపయదినంబు లరిగిన షడ్వింశతితమద్వారంబునఁ బోవుచు.

31


ఇరువదియాఱవ బొమ్మ కథ

క.

తెల్లనికొండయు గుజ్జును
దెల్లనిపూఁతయును మేను దెల్లనిపాముం

  1. కాశము ముట్టి నాకడఁ బ్రకాశభజించితి
  2. చనుదెంచె వేగ నెలమిన్ ధాత్రీశుఁ డుజ్జేనికిన్
  3. నీ కరవీసంబును లేదు