పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

399


నొనరిన దేవతార్చనల హోమములన్ గ్రహపూజ [1]మున్నుగా
జనవర [2]శక్తికిం దగినశాంతి యొనర్పుము వర్షణంబగున్.

20


క.

ఇనుమున నాశనిరూపం
బొనరించి వినీలవస్త్రయుక్తంబుగ న
ర్చనము రచియించి ఖది రేం
ధనమున హోమంబు సేయఁ దత్ప్రీతియగున్.

21


చ.

అనినఁ ద్రివిక్రముండు మొదలైన పురోహితులన్ గ్రహాదిపూ
జనములు సేయఁ బంచి మృదుశాలిమయాన్నముఁ బాయసంబులున్
మునుముగఁ బిండివంటలు సమూహముగా నొనగూర్చి యిష్టభో
జనముల [3]భూసురు ల్దనియ శాంతి దలంబుగఁ జేసి శక్తితోన్.

22


క.

దేశాధీశ్వరుఁ డర్థుల
కాశాపరిపూర్తి సేయ నారాధిత యౌ
నాశాపూరణి దేవి ని
వేశాంగణసీమ హోమవిధి గావించెన్.

23


ఉ.

ఈగతిఁ బెక్కుహోమములు నీగులు [4]బూజలుఁ జేసిచేసి వ
ర్షాగమ మేమియుం గనక యక్కట యాగము మీఱు నాశుభో
ద్యోగము వ్యర్థమయ్యె శివయోగినియుం గరుణింపఁ దంచుఁ జిం
తాగతుఁ డైనవేళ గగనస్థలి నయ్యశరీరి[5] యి ట్లనున్.

24


ఉ.

భూపకులేంద్ర యింత దలపోయఁగ నేటికి యోగమాత యా
[6]శాపురి సంతసిల్లి యతిసత్త్వము నీకొసఁగెం బ్రభావసం

  1. మున్నొనర్చను
  2. శక్తికిం దగిన శాంతి యొనర్పును వర్షణం బగున్. యొనర్పుమతర్షణంబులన్
  3. భూజనుల్దనియ
  4. నింపుగ బూజలు నీగులు శాంతిఁ జేసి
  5. గగనాంతమునందశరీరి
  6. శాపురి శక్తి సంతసిలి సత్వము