పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

392

సింహాసన ద్వాత్రింశిక


క.

అనుచు న్వాలాయంబుగఁ
దను వేఁడిన మనములోనఁ [1]దత్తఱవడ కే
మనవచ్చు మీరు నావ
ర్తన మెఱుఁగుదు రెవ్వరొక్కొ దైవతమూర్తుల్.

133


క.

తెలిసెద నని నృపుఁ డావి
పుల సంబోధించి యిచటఁ బొంకకుఁ డధికో
జ్జ్వలము లగునర్థిరూపం
బుల మీ రెవ్వరు సమస్తముం జెప్పుఁ డనన్.

134


ఆ.

[2]శాలివాహు నట్లు చంపఁ గడంగు నీ
బలము ఫణులచేతఁ బొలిసినంత
వాసుకికిఁ దపంబు సేసి నీ వమృతము
వడయు టెఱిఁగి మమ్ముఁ నినిచె నతఁడు.

135


క.

వడుగు లయి విక్రమార్కుని
కడకుం జని వేఁడి యమృతకలశము మీచే
పడఁ జేసికొనుఁడు యాచకు
లడిగిన వంచింప కిచ్చు నతఁ డని చెప్పెన్.

136


క.

తప్పక చెప్చితి మేమును
దప్పక నీవును యథోచితము సేయుము నీ
చొప్పు వొగడ వేజిహ్వల
యప్పన్నగవిభున కైన నలవియె భూపా.

137


వ.

అని నిజరూపంబులు చూపినం గొంత చింతించి విక్రమార్కుం డర్థు లడిగినం దనకు మోచినపని గాన నీక తలంగె నను నపకీర్తి వచ్చు దీనిమీఁద

  1. దక్కలవడి దక్కలవిడియే
  2. శాలివాహు మీరు నాలంబు సేయు నీ-బలము