పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

389


క.

మీరుం బొలియక పొండని
వీరుండై పలికె నంత వీరుం దమయు
ర్వీరమణునకుం జెప్పఁగ
వైరం బిఁకఁ బుట్టు ననుచు వచ్చిరి మగుడన్.

120


వ.

అంతకుము న్నొకదినాధికవర్ష యగుకన్యకకుం బుట్టినవాని నరయం బోయిన బేతాళుండు నతనియునికి వినిపింపంగ నతని భృత్యులుం జని యోమహారాజ నీయాజ్ఞతోడంగూడ మమ్ముఁ బాఱఁ ద్రోపించె నబ్బాలుండు బాలార్కులీలం గ్రాలుచుండు నని చెప్పి [1]తద్ధీరోక్తు లెఱింగించిన.

121


క.

కలఁగియుఁ గలగక యాతఁడు
బలములు గొలుపంగ నేగి పైఠాణము ద
వ్వుల విడిసినఁ గొందఱు భృ
త్యులు ముందఱఁబాఱి గవనిదూఱిరి పెలుచన్.

122


సీ.

తూఱి తోరణములు ద్రుంపఁగాఁ బ్రజ లెల్ల
        నడలిన వారిభయంబు లుడిపి
తండ్రియౌ నాగేంద్రుఁ దలఁచి తచ్ఛక్తిఁ గృ
        త్రిమరూపములకుఁ బ్రాణములు వడసి
కదలుచో నిండ్లు వృక్షంబులు గోటలు
        జంగమత్వము నొంది సరస నడచె
నొకశాల నెక్కి బాలకుఁ డది యాదిగా
        శాలివాహనుఁ డను సంజ్ఞఁ దాల్చె


ఆ.

సేన లట్లు వెడలి భూనాథుభృత్యులఁ
బఱపి మొదలిదండుపైఁ గడంగి

  1. తద్విరోధోక్తులు