పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xliv

అథ అశుభాః :

“ఖరోష్ట్ర మహిషవ్యాఘ్రాన్ స్వప్నే యస్త్వధిరోహతి
 షణ్మాసాభ్యంతరే తస్య మృత్యుర్భవతి నిశ్చయాత్॥

"ఆరోహణం కంటక వృక్షవాహవైర్యుష్ట్రకాణా మథ దర్శనాని
 కార్పాస తీవ్రోరగ పోత్రి శాఖామృగాదిమానా మశుభాని లోకే"

ఫలకాలశ్చ-

“స్వప్నస్తు ప్రథమే యామే, వత్సరేణ విపాకభాక్
 ద్వితీయే చాష్టభిర్మాసైః, త్రిభిర్మాసైః తృతీయకే.
 అరుణోదయ వేళాయం, సద్యః స్వప్నఫలం భవేత్."
 అని చెప్పబడినది. వీనినే గోపరాజు గ్రహించెను ,

స్వప్నఫలకాలములను మాత్రము యథాతథముగ ఆనువదించినాడు. శుభాశభ స్వప్నఫలములు చెప్పుటలో మూలమున లేని వానిని చాల చెప్పెను. ఇవి నాటి జనవ్యవహారములోనివి కావచ్చును.

శుభ స్వప్నములు- ఏనుగు, గుఱ్ఱము, పచ్చనిమ్రాను, మేడ, పోతుపసరమును ఎక్కినట్లు వచ్చిన కలలు శుభములు. పాములు తేళ్ళు జలగలు కరచినట్లు వచ్చిన చావును చెప్పును. శరీరమునకు మలము పూసుకున్నట్లు, స్త్రీలతో రమించినట్లు వచ్చిన శుభములు. తలను పేనుకొరుకుట, ప్రేవులు చుట్టుకున్నట్లుండుట, నెత్తురు, కండలు, పాలు, పెరుగు, కల్లు, నేయి త్రాగుట శుభములు. నీటిని, రక్తమును చూచిన దీర్ఘాయువు, మంట, గంట, పచ్చని పంట, తెలుపురంగు కనబడిన మంచిది. బూడిద, ఎముక, ధాన్యపుపొట్టు, ప్రత్తి, ఉప్పు కనబడిన చెడ్డది. మొద్దును, గాడిదను, దున్నపోతును, ఒంటెను ఎక్కిన, అన్నమును, పిండిని, నువ్వులను తినిన కీడు కలుగును. ఏనుగు, దేవత, కస్తూరి, గోపురము, నీలమణులు, మేఘములు, భూమి, యమునానది, కుండలు తప్ప కలలో ఇతరములైన నల్లవస్తువులు చెడ్డవి.