పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

పాదరనము పసులు పసిఁడి యర్థధనంబు
పావుగొఱఁత ధనము పండుభూమి
ధరణి నధికధనము ధాన్యంబు గావున
వాని గొనుఁడు పెద్దవానివరుస.[1]

115


చ.

అనవుడుఁ జోద్యమంది కొనియాడుచుఁ గ్రమ్మఱ మ్రొక్కి వైశ్యనందనులు కృతార్థులై మగిడి తండ్రిగృహంబున నున్న సొమ్ము లాతనివచనస్థితిం గొని ముదంబున నుండఁగ విక్రమార్కుఁ డొయ్యనఁ బరదేశముల్టిరిగి యాత్మపురంబున కేగి యిమ్ములన్.

116


చ.

వలనుగ నొక్కబాలకుఁడు వైశ్యులపాళులఁ దీర్చెనంచు మం
త్రులు వినిపించిన న్విని విరుద్ధము బాలున కివ్విశేషకౌ
శల మని చోద్యమంది నిజశత్రునిగా మది నిశ్చయించి భృ
త్యులదెసఁ జూచి వాని నిట దోడ్కొనిరం డని పంచెఁ బంచినన్.

117


ఉ.

ఆనరనాథుభృత్యులు మహాబలు లేగి రయంబునం బ్రతి
ష్ఠానపురంబు సొచ్చి శిశుసంగతి నాడెడు శాలివాహు ను
జ్జేనికి విక్రమార్కుని భజింపఁగ రమ్మని పల్కునంత వై
శ్వానరుమీఁద నెయ్యొలుకుచందము గానఁగ నయ్యె నయ్యెడన్.

118


ఆ.

వెఱ్ఱిజోగిఁ జూపి విక్రమార్కుం డని
వెఱపువెట్టి విఱ్ఱవీఁగవలదు
మీనృపాలకుండు తానె రా జౌనేని
నిటకువచ్చి బ్రతికి యేగు మనుఁడు.

119
  1. గీ. పాదధనము పసులు పసిఁడిపాదధనంబు, పాదధనము పొలము పంటయూళ్ళు, ధరణిపాదధనము ధాన్యంబు గావున, వాని గొనుడు పెద్దవాని వరుస.