పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

387


శా.

ధర్మాధ్యక్షులు మంత్రులుం బిదపఁ దద్వాదంబు దీర్ప న్వణి
ఙ్మర్మం బేమియుఁ గానలేక నగుచు న్మాకేల కల్లాడ నం
తర్మాయపరుఁడైన మీజనకుఁ డర్థం బుండఁగాఁ బాళ్ళుగా
నిర్మించె న్మును బొగ్గు లాది యగువానిం బంచికొం డిమ్ములన్.

109


మ.

అని హాస్యంబుగఁ జేసి పుచ్చినను నర్థాసక్తులై[1] వైశ్యనం
దను లూరూరికి నేగి చెప్పికొనుచున్ ధాత్రిం బ్రతిష్ఠాననా
మనిరూఢం బగు వీడు చొచ్చి చని తన్మధ్యంబునన్ శాలివా
హనునిం గాంచిరి దివ్యతేజుఁ డయి బాల్యక్రీడఁ గ్రీడింపఁగన్.

110


చ.

కనుఁగొని దివ్యమూర్తి యని గౌరవ మెంతయుఁ దోఁప మ్రొక్కి యో
దినకరతేజ మాతగవు దీర్పుము ధారుణి నెల్లచోటులం
గనికని చెప్పి నిర్ణయము గానక వచ్చితి మంచుఁ దండ్రి చే
సిన నియమంబు మున్నుగ నశేషముఁ జెప్పిన నక్కుమారుఁడున్.

111


క.

మీతండ్రియ పాళ్ళులు ని
ర్ణీతములుగఁ జేసి చనియె నేరక మీ రీ
భూతలమునఁ దిరుగఁగ నొక
చాతుర్యము గలుగునట్టి జనుఁడును లేఁడే[2].

112


వ.

అయిన నేమి యయ్యెఁ దెలియ విండు.

113


ఆ.

ఉముక ధాన్యరాసు లెముకలు పశువులు
మన్ను పొలముగలిగియున్నయూళ్ళు
బొగ్గులును బసిండిప్రోవులు పాళ్ళుగా
నిచ్చినాఁడు వానిఁ బుచ్చికొనుఁడు.

114
  1. ననర్థాయాసులై
  2. వినఁడే