పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

381


బును బిండియు నువ్వులు గలఁ
[1]దినఁగన నగుఁ గీడు వసుమతీవరతిలకా.

77


క.

నూనెయుఁ గలియును గ్రొవ్వును
దేనెయుఁ గలఁ ద్రావెనే నతివ్యాధియగున్
వానరము బొగయుఁ గాకియుఁ
గానంబడెనేని గీడు గానఁగవచ్చున్.

78


క.

మదగజము దేవరయు మృగ
మదమును గోపురము నీలమణులు న్నవనీ
రదములు ధరణియు యమునయు
నుదకుంభము దక్క నలుపు లొప్పవు గలలన్.

79


చ.

జనవర నల్పులందు మహిషం బతినింద్యము దాని నెక్కిన
ఘనమగుకీడు గాన నధికం బగుశాంతి యొనర్చి యాకృతాం
తునకు మహోపచారములఁ దుష్టి జనింపఁగఁ జేయ మేలగు
న్నినుఁ బనివంప నిట్లొరులు నేర్తురె రాజవు నీవు నావుడున్.

80


మ.

ధరణీశుం డిది యెంతకార్య మని యుత్సాహంబుతో శాంతి చె
చ్చెరఁ గావించి కృతాంతుఁ బూజల నతిక్షేమంకరుం జేసి స
ద్గురులం బేదల విప్రుల న్వరుసతో గోభూతిలార్థంబులం
బరమప్రీతులఁగా నొనర్చి పిదప న్బండారితో నిట్లనున్.

81


క.

భాండాగారములందుఁ బ
సిండియు రత్నములుఁ బట్టుఁజీరలు ధనము
న్నిండ నిడి తలుపు లెవ్వియు
నుండఁగనీయకుము నీవు నుండకు మచటన్.

82
  1. దినగోరంగాదు