పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

సింహాసన ద్వాత్రింశిక


క.

తొలివేకువగాఁ దూర్పునఁ
దెలు పెక్కఁగఁ గన్నకలలు దినదశకమునన్
ఫలియించుఁ [1]బసులవిడువం
దలఁకొనుకల సిద్ధిఁ బొందుఁ దద్దివసమునన్.

72


క.

ఏనుఁగు గుఱ్ఱముఁ బచ్చని
మ్రానును మేడయును మెట్టు మగపసరంబుం
బూని కలలోన నెక్కిన
మానవునకు సుఖము రాజ్యమహిమయుఁ గలుగున్.

73


క.

కలలోఁ బాములుఁ దేళ్ళును
జెలగలు గఱచుటయుఁ [2]జావుఁ జెప్పెడుఁ బొరిమై
మలమంటుట పొందందగు
లలనలఁ బొందుట సుతార్థలాభము చుమ్మీ.

74


క.

[3]తలఁ బేను దినుటయును బ్రే
వులఁ జుట్టఁగఁబడుట మానవుల నెత్తురుఁ గం
డలుఁ బెరుఁగుఁ బాలు మద్యం
బులు [4]నెయ్యిని ద్రావుటయును ముదమగుఁ గలలన్.

75


ఆ.

నీరు నెత్తురుఁ గనిన [5]నిడుదగు నాయువు
మంట గంట పసిఁడిపంట గంట
తెలుపు లెల్ల మేలు కలలోన వెలిమిడి
యెముక ప్రత్తి లవణముముకదక్క.

76


క.

వినుమిఁక [6]మొద్దును గాడిద
నెనుపోతును లొట్టిపిట్ట నెక్కిన నన్నం

  1. బసులఁ బిదుకఁదలకొను
  2. జావుచే టొదవును మై
  3. తలబేనుతీట
  4. నెరయద్రావుట
  5. నిడివగు, నిగుడనౌ
  6. యెద్దును, మ్రోడును