పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xliii


అనదల అర్థుల ఆర్తులఁ బాత్రులఁ
       బూజ్యుల విప్రులఁ బ్రోవవలయు

బలముఁ దెంపుఁ గలిగి అలుకయుఁ గరుణయుఁ
జలము నిలుకడయును జరుపవలయు
నయముఁ బ్రియము వైరిజయముఁ గార్యముఁ గొల్వు
నితర రాజగతుల నెఱుఁగవలయు. (4-83)

9. విటభేదములు- అమూలకము (4-241)

10. వేశ్యమాత చర్యలు- అమూలకము. (4-243,55)

11. మధుపానగోష్ఠి- అమూలకము. (4-256)

12. యోగశాస్త్రము- మూలమున లేకున్నను యోగ విశేషములు 8 పద్యములలో చెప్పబడినవి. (5-12,17)

13. మల్లయుద్ద విశేషములు- మూలమునలేని, తనకాలమున వాడుకలో ఉన్న మల్లయుద్ధమును గూర్చి విపులముగ వ్రాసినాడు. కలహకంటక ఏకాంగవీరులను ఇద్దరు భటులు పంతముతో తలపడుదురు. ఆ సందర్భమున దంద్వయుద్ధపద్ధతులు, దాని నియమములు, మల్లుల వస్త్రధారణ, తొమ్మిది విధములైన పట్లు మొదలైన వానిని చెప్పెను. (7-45,64)

14. స్వప్నశాస్త్రము- మూలమున ఇరువది మూడవ సాలభంజిక కథలో స్వప్నములను గూర్చి ఇట్లున్నది:

“స్వప్నాస్తు ద్వివిధాః, కేచన శుభాః శుభఫల ప్రయచ్ఛంతి, కేచన అశుభాః అశుభఫలం ప్రయచ్ఛంతి తత్రశుభాః :

శ్లో॥ ఆరోహణం గోవృషకుంజరాణాం, ప్రాసాదశైలాగ్రవనస్పతీనాం
     విష్టానులేపో రుదితం నితాంతం, శుభాన్యగమ్యాగమనం తథైవ॥