పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

377


రీతి యెఱిఁగి కల విఱుచుట
నీతి చుమీ విఱుపుకొలది నిజమౌ నదియున్.

54


ఆ.

వినుము ధరణినాథ విన్నప మియ్యెడఁ
దొల్లి యొక్క మనుజవల్లభుండు
దేవుఁ డుదయమైన యావేళఁ గలగని
లేచి యొద్ది వనితఁ జూచి పలికె.

55


క.

సన్నపుగట్టుననుండి స
మున్నత మగుకొండమీఁది కుఱికితి నని నే
జిన్నకలఁ గంటి నీఫల
మొన్నఁగ నీమదికిఁ జూడ నెట్లగుఁ జెపుమా.

56


వ.

[1]నావుడు నది ప్రేమపాత్రం బగుభోగస్త్రీ గావున బరిహాసరూపంబుగా నగుచు దిబ్బనుంటి కొండ కుఱుకబోయిన నడుముం గాలు విఱుగంబడియెద వనిన.

57


క.

నగుచుం గేహము వెలువడి
జగతీపతి జలకమాడి సంధ్యార్చన యొ
ప్పుగఁ దీర్చి యేగి కొలువునఁ
దగువారలవంకఁ జూచి తనకలఁ జెప్పెన్.

58


క.

చెప్పిన [2]నతనికిఁ గలలో
నప్పర్వత మెక్కుడిది మహాశుభ మగు నే
చొప్పున ఫల మొనగూడునొ
తప్పక వినిపింతుమనుచుఁ దలపోసి యటన్.

59
  1. క. నావుడునది భోగస్త్రీ
    గావునఁ బరియాఛకంబుగా గుబ్బలినుం
    దావలికొండకు నుఱకం
    బోవుటఁ యటఁ గాలు విఱుఁగబొరిబడె దనినన్ (ఒక్క ప్రతి)
  2. నందఱు