పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376

సింహాసన ద్వాత్రింశిక


శా.

అంతర్గేహములందుఁ గ్రొవ్విరులపర్యంకంబుపై వేడ్కతో
గాంతారత్నముతోడఁ గూడి పిదపం గందర్పకేలీపరి
శ్రాంతుండై శయనంబు రెండుదెసలన్ రత్నంపుదీపంబు ల
త్యంతంబు న్వెలుఁగొందఁ గామసుఖనిద్రాసక్తుడై యుండుచున్.

49


చ.

బలబలఁ దెల్లవాఱునెడఁ బార్థివశేఖరుఁ రత్యరిష్టమౌ
కలఁగని మేలుకాంచి యధికం బగువిస్మయ మంది లేచి తా
జలకము దీర్చి సంధ్యపరిచర్య యొనర్చి యనేక భూషణో
జ్జ్వలనిజమూర్తియై కొలువుసాలకు వచ్చి కవు ల్నుతింపఁగన్.

50


ఆ.

వచ్చి దొరలు గొలువ వజ్రసింహాసనా
రూఢుఁడై ముఖాబ్దరుచి యెలర్పఁ
దన్నుఁ గొలుచువారిఁ దగురీతి మన్నించి
తేరకొనఁగ హితులదిక్కు చూచి.

51


క.

వినుఁ డేను రక్తచందన
మున నంగము దోఁగ మేఘమున కెనయను కా
రెనుబోతు నెక్కి యామ్యము
[1]చనుచుంటినొకండ నంచు స్వప్నముగంటిన్.

52


క.

ఈకల శుభమో యశుభమొ
నా కనవుడు నందఱు న్మనంబుల భీతి
వ్యాకులులై వదనము లా
లోకింపఁగ దృష్టకౌశలుం డొకఁ డనియెన్.

53


క.

ధాతుగుణంబులఁ గల లుప
జాతములౌ[2] వినికి జూడ్కి సంస్మరణమునన్

  1. చనియెద నేనొకఁడ
  2. జాతంబులు