పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

371


దరిగిరి రాజ్య మొల్లక మృషాకృతిఁ ద్రిమ్మరు టేమి నామతి
స్ఫురణము దప్పకుండ నిఁక బొంకక చెప్పుము నీవు నావుడున్.

24


ఉ.

సత్యము నీమతిస్ఫురణ క్షత్రియవంశకరుండ విక్రమా
దిత్యుఁడ నే నవంతినృపతిం బరదేశవిశేషదర్శనం
బత్యనురక్తిఁ జేయఁగ నయంబునఁ ద్రిమ్మరుచుండుదు న్సుఖౌ
చిత్యగుణంబు నా కిదియ చెప్పెడి దే మిఁక భూసురోత్తమా.

25


సీ.

అనవుడు నాశ్చర్యహర్షంబు లొందుచు
        భూసురోత్తముఁ డాత్మబుద్ధి మెఱసి
మృదులాంబరంబులు మేనఁ బూనక జోగి
        కైవడి నీకంథ [1]గప్ప నేల
హంసతూలికశయ్యయందు నిద్రింపక
        బూడిదలోఁ బడి పొరలనేల
ఘనమైసరాజ్య మేకచ్చత్రముగఁ గల్గఁ
        దిరిపెమై యూరూరుఁ దిరుగనేల


ఆ.

అష్టభోగములకు నాలయం బయ్యు నీ
వష్టకష్టములను నలయనేల
కుడువఁ గల్గి నీకుఁ గుడువలేకుండుట
యల్పతరముగాదె యవనినాథ.

26


క.

[2]ననుఁబోటి పేదయైనను
ధన మించుక కలిగెనేనిఁ దనమది స్రక్చం
దనవనితాదిసుఖంబుల
మనఁ గోరుం బసరమైన మరగదె సుఖముల్.

27
  1. నీగంత-నీబొంత
  2. ననుబోటియంతయైనను