పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

369


లోనఁ బుప్పొడియును దేనెయుఁ జల్లంగా
నెండకన్నెఱుంగకుండె నజుఁడు.

14


సీ.

విసనకఱ్ఱలు వట్టివేళ్ళచప్పరములుఁ
        జందనంబులు ఘనసారములును
జల్లనినీళ్ళు నిచ్ఛాభోజనంబులు
        గలవారి కిష్టసౌఖ్యంబు జరుగఁ
బని చేసి గంజి యైనను నంబ లైనను
        నెద చల్లఁగాఁ ద్రాగి యెచట నైనఁ
బడియుండి వెన్నెలగుడిపాట[1]
        పాడఁగా బేదల కాత్మసంప్రీతి గలుగు


ఆ.

మంచురొంపిముసురు లేక మార్గికులకుఁ
జల్లపాటునఁ[2] బయనంబు సాగుచుండు
నచ్చవెన్నెల సుఖనిద్ర యంబుకేలి
యమరు వేసవి కితరకొలములు సరియె.

15


క.

అమృతము రసమ్ముక్రియ వేఁ
డిమి నెగసి జలంబుకడకు డిగజాఱిన చం
దముగా నవ్వేసవి జల
మమృతంబై జీవములకు నది చవి కెక్కెన్.

16


వ.

అట్టి దివసంబుల.

17


శా.

గూఢంబౌ నిజవర్తనం బమర నాక్షోణీవరుం డంత నా
రూఢుండై పరభూములందుఁ గడపెం గ్రూరప్రవృద్ధాతపో
ద్గాఢాంభోరుహమిత్రదీప్తివిదళత్సర్వంసహామండల
వ్యూఢారణ్యవిదాహదావసముదగ్రోష్మంబునన్ గ్రీష్మమున్.

18
  1. గడుబొట్టవాడగా
  2. చల్లబూటల