పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

ఓరి పాపకర్మయున్న [1]మంత్రికుమారు
లవనిపాలు కొలిచి యచట నచటఁ
బనులు సేయఁగఁ జడుఁ డనుచు నాకును దల
వంపు సేసితి సరివారిలోన.

135


క.

అను వగుతనయుఁడు పుట్టిన
జనకుని కిహపరసుఖములు సమకూరు నన్న
న్మును వింటి నేను నినుఁ గని
[2]మని మని నేఁ డిట్లు నరకమగ్నుఁడ నైతిన్.

136


క.

ఒడ్డును బొడవును రూపును
దొడ్డతనము గలిగి ప్రజ్ఞతోఁ బొదలనియా
బిడ్డని గనుకంటెను సతి
గొడ్డయినను మే లనంగఁ గుందుటగలిగెన్.

137


ఆ.

ఎట్టకేనియుఁ దగు పుట్టువు గల్గియు
గట్టియైన యెఱుకపట్టు లేక
యిట్టిభంగి వ్యథలఁ బెట్టుటకంటెను
బుట్టినపుడె యేల గిట్టవైతి.

138


చ.

గృహమున నుండి నన్నుఁ గలఁగింపక యొండెడ కేగు మన్న నా
గ్రహిలుఁడు సిగ్గుదాల్చి యధికం బగు మానము వూని లేచి యా
గ్రహమున శాస్త్రము ల్సదివికా నిఁక నింటికి రానటంచు సో
త్మహితము గోరుచు న్వెడలి దక్షిణభూమికి నేగె నొక్కఁడున్.

139
  1. మంత్రికుమార
    వరులకాలిగోరు సరియుగావు
    చెడుగుఁ బనులు సేయఁగడఁగి నాకిట దల
  2. మనుకడ లేనట్టి నరక