పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

సింహాసన ద్వాత్రింశిక


క.

కినిసి వరాహము వొడిచిన
శునకముతల ద్రెళ్ళి యెగసి చొప్పేర్పడ నొం
డునెలవునఁ బడియెఁ గవ్వడి
తునుమాడిన యా జయద్రథునితలవోలెన్.

28


వ.

అంతట వేఁటకాండ్రును నొండొరువులఁ గడవం బాఱి గంటిలేని కుఱుగంట్లం గలిగి మెఱుఁగారెడి సూటిగల పందిపోట్ల దృఢంబుగా నత్తుకొని యొత్తిలి పోయి మొగము దప్పుమాటున బలుమాటునం గదిసి పెద్దగున్నలను, జిఱుగున్నలను, బిడిపందులను, నెడమల్లరంబులను, గొమ్ముకాండ్రను నొక్కుమ్మడిం గ్రమ్మునప్పుడు.

29


క.

గంధగజలీలఁ బంది మ
దాంధంబై యొకని జీరినట్లుగఁ బొదువ
న్సంధింపం బడిన జరా
సంధుని క్రియ వ్రయ్య లొక్కసరసం బడియెన్.

30


ఆ.

అట్టివేళ నృపుఁడు కట్టెదురను
[1]నారి బెట్టుపొడను, నమ్ము వెట్టి తిగిచి
బొట్టు వెట్టినగతిఁ బట్టెలసం దేసెఁ
దిట్టినట్లు పంది మిట్టి పడఁగ.

31


వ.

ఆసమయంబున బెబ్బులిం గని పఱచుపశువులపగిది నవ్వనమదగజంబులు మొదలుగాఁగల మృగంబులును వేఁటకాండ్రును నొక్కదిక్కునకుం బఱతెంచిన నంతం దత్పశ్చిమభాగంబున.

32


సీ.

పాతాళ మీఁగినపందిఁ బోరికిఁ బిల్చు
కైవడి నందంద కాలు ద్రవ్వుఁ

  1. నారి, జిట్టబొడమికమ్ము వెట్టినగతి పందివాట్లగృచ్ఛి పట్టెత్తిదద్దెనం-