పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxviii


బడిన, అన్నాడు. అతని ఉద్దేశమేమో తెలియదు. మూలమందలి భావమును ఉభయులును చక్కగా అనువదింపలేదు.

మూడవ అక్కరము "మి"కి మూలమునందు

"మిత్రద్రోహి కృతఘ్నశ్చ
 యశ్చ విశ్వాసఘాతుకః
 త్రయస్తే నరకం యాంతి
 యావచ్చంద్ర దివాకరమ్."

జక్కన "మిత్రద్రోహి, కృతఘ్నుఁడు
       ధాత్రీసురహంత, హేమతస్కరుఁడు, సురా
       పాత్రీభూతుఁడు, నిందా
       పాత్రులు వీరెల్ల నరక భవనావాసుల్".

గోపరాజు “మిత్రద్రోహి, కృతఘ్ను ప
        విత్రగురుద్రోహి చౌర్యవిద్యాపరులున్
        మిత్ర శశి స్థితి మేరగఁ
        బుత్రులు గలిగియును నరకమునఁ బడుదురనా".

జక్కన మూలములోని ముఖ్యమైన విశ్వాసఘాతుకుని దీసివేసి ధాత్రీసురహంతను, హేమతస్కరుని, సురాపాత్రీభూతుని గ్రహించి వీరు నిందాపాత్రులని వ్రాసెను. కథయందలి రాజకుమారుడు, మిత్రద్రోహి, కృతఘ్నుడు, విశ్వాసఘాతుకుడు. ఆ విషయమును దెలుపుటకే ఆ ముగ్గురును ఆచంద్రార్కము నరకములో ఉందురని మూలకారుడు వ్రాసెను. జక్కన ఆ సారస్యమును గ్రహింపలేదు. ఇక గోపరాజు ప్రాసకక్కుర్తికి లోనై 'పవిత్రగురుద్రోహి', 'పుత్రులు కలిగియు' అను నిరర్థకములను వాడెను. మూలము నితడును అవగాహన చేసికొనలేదు.