పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

సింహాసన ద్వాత్రింశిక


బడనుఱికి పీఁటమీదను
జడియక కూర్చుండి యోగిచందము దోఁపన్.

134


క.

ధరణీశుం డెక్కిన మొగ[1]
తిరుగక కంబంబు తొంటితెఱుఁగున నాభా
స్కరుగతికొలంది జంకక
పెరిఁగెఁ గపటవామనుండు పెరిగినకరణిన్.

135


శా.

కంభం బీక్రియ నిక్కుచున్ బిఱుసుగల్గం బెద్దయు న్నిక్కఁగా
గంభీరుం డగురాజు కైకొనఁడ యాకాశంబు ముట్టంగ న
య్యంభోజాప్తుఁడు చేరనిచ్చు టది హైన్యంబంచు మధ్యాహ్నసం
రంభం బేర్చడ నెండచిచ్చు గొని పర్వంజేసె గర్వంబునన్.

136


ఉ.

చేసిన నెండపెల్లునకుఁ జిక్కక స్రుక్కక నిక్కి మిక్కిలిన్
డాసినఁ గ్రమ్మఱ న్రవి దృఢంబుగ రశ్మిసహస్రమెల్లఁ బై
నీసునఁ గప్పినంతఁ జలియింపక నిల్చినవానిఁ జూచి యు
ల్లాసముతోడ నిట్లనియె లావును దాల్మియుఁ దెంపు మెచ్చుచున్.

137


ఆ.

లక్షయోజనంబులను నిల్చి యైన నా
యెండ మానవులు సహింపలేరు
నన్నుఁ జేరనోపునా యన్యుఁ డట్లేని
గాలి నేలపాలు గాక యున్నె.

138


క.

నరనాయక నీ వీయెడఁ
బరమేశ్వరు కరుణఁ జేసి బ్రతికితి నిజసు
స్థిరభావము సాహసమును
బరికించి మనంబు హర్షభరితం బయ్యెన్.

134
  1. ధరణిపుఁ డెక్కిన మగ్గక, తిరమై.పా.