పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxvii


గోపరాజు. "సజ్జన భావము గలుగు సు
         హృజ్జనముల మోసపుచ్చుటిది నేరుపె నీ
         పజ్జ తొడమీఁదఁ గూర్కిన
         యజ్ఞంతువుఁ జంపఁ జూచుటది పౌరుషమే"

జక్కన మూలపూర్వార్ధమును చక్కగా అనువదించెను. ఉత్తరార్ధములోని 'హననే కింను పౌరుషమ్' (చంపుటలో మగతన మేమున్నది) అను వ్యంగ్యమును వాచ్యము చేసినాడు. గోపరాజు ద్విత్వజకార ప్రాసము గ్రహించి కొంత తికమక పడినను మూలమును సరిగా అనువదించెను.

        రెండవ అక్షరము "సే" మూలమునందు
        "సేతుం దృష్ట్వా సముద్రస్య,గంగాసాగర సంగమమ్
        బ్రహ్మ హత్యాత్ర ప్రముచ్యేత, మిత్రదోహో నత్రముచ్యతే”

జక్కన "సేతువు దర్శింప మహా
       పాతకములుఁ బాసిపోవుఁ బ్రాణసఖునకున్
       ఘాతుకమతి నొనరించిన
       పాతక మే తీర్థసేవఁ బాయునె నరునిన్.

గోపరాజు "సేతువుఁగని, జలనిధి సం
        జాతధనుష్కోటిఁ బడిన సద్ద్విజహతికిం
        బాతకము వాయు మిత్రవి
        ఘాతికిఁ బాతకమె కాని గతి కలుగదనా".

జక్కన పద్యములో మూలమందలి 'బ్రహ్మహత్యాప్రముచ్యేత'కు బదులు 'మహాపాతకములు బాసిపోవు' అని, వ్రాయ బడినది. గంగా సాగర సంగమ దర్శనమునకు బదులు 'ఏతీర్థ సేవచేనైన' అని చేర్చబడినది. గోపరాజు గంగా సాగర సంగమమునకు బదులు, జలనిధి సంజాత ధనుష్కోటి