పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

సింహాసన ద్వాత్రింశిక


త్యుపకారంబును గలుగక
చపలమతీ దీని నెక్కఁ జనునే నీకున్.

82


క.

ఉర్వీనాయకుఁ డయ్యును
నిర్వాణుల మీఱి యర్థనిస్పృహుఁ డగునా
సర్వజ్ఞుని సద్గుణములు
నిర్వచనముగాఁగ వినుము నే వినిపింతున్.

83


క.

మాటలయం దెఱిఁగెద వే
నాఁటను ముంజేతికంకణంబున కద్దం
బేటికి వితరణగుణమునఁ
బాటిల్లెడి గుణము లెల్లఁబ్రభువుల కుర్విన్.

84


క.

మతిగలిగి చదువుఁ జిలుకలు
[1]హతమందంగాను బోటులాడుం బశువుల్
వితరణ మెవ్వనిగుణమగుఁ
జతురుఁడు శూరుండు నతఁడె జనులం దెల్లన్.

85


ఆ.

విక్రమార్కుబాహువిక్రమం బుర్విలో
నరులచేతనెల్ల నరులు గొనఁగఁ
గీర్తనియ మైన కీర్తిఁ గీర్తించుచు
నర్థు లర్థములఁ గృతార్థు లైరి.

86


సీ.

ఆదివసముల వర్షాత్యయోచితముగా
        దలమైన వానలు వెలుచునంతఁ
దెల్లవాఱినయట్టితెఱఁగున నావేళఁ
        దనమేళనం బెల్లజనులు వొగడ

  1. హతముగఁ బోట్లాడు పసులు నజ్ఞానకృతుల్