పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

సింహాసన ద్వాత్రింశిక


లోకహితముగాని యేకాంగిపోరునఁ
జచ్చువాని కేమి స్వర్గమౌనె.

51


వ.

నావుడు వీరకులోత్తముం డగు వీరకులోత్తముండు.

52


ఆ.

మానభంగ మైనమరణంబు శూరుల .
కదియ చూడ నాత్మహత్య గాదె
యాత్యహత్య పాప మది నీవ యెఱుఁగుదు
పాప మొందకున్న బ్రదుకు బ్రదుకు.

53


వ.

వ్రేసినవ్రేటును గాఁడినమాటయును లేకయుండుటది మహావ్రతంబు.

54


క.

బొంకుట సుర సేవించుట
బొంకమి వేయశ్వమేధములఫలము భటుం
డంకమున సత్యమునకై
శంకింపక వచ్చెనేని స్వర్గము గాదే.

55


క.

అది యెట్లనినను మిత్రుఁడు
మదిఁ గలఁగెడుననియు వీండ్రు మడిసెదరనియుం
గొదికెడు నామన మనవుఁడు
నిదియెంత ప్రసంగమనుచు హితమతిఁ బలికెన్.

56


క.

[1]అంగాధిపతియు నేనును
ముంగల నిరుదెసల నిల్చి మొనయుకఠారుల్
ఖంగనఁగఁ బట్టి బంట్లకు
భంగము గాకుండ మనసుఁ బట్టెద మనఘా.

57


క.

అనునెడ నిద్దఱు బంటులుఁ
జనుదెంచి కడంక మొక్కి జనవర మముఁ జూ

  1. ఛంగున దాటుచు రాజుకు, ముంగల