పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

301


వ.

ఒకఁడు దేవరభాండాగారంబు నింటికడం బాలెము వడం గొలిచి పళ్లెరంబులఁ బ్రసాదంబు దినుచుఁ బోతుక్రియ నుండ నొకనాఁడు దేవర దర్శింపవచ్చి వారిసందడిలో నొక్కయీడిగ తనకాలు దొక్కినం గోపించి యేమిరా బంటుమల్లు న న్నెఱుంగవా తన్నితి వనిన నతండు నే నేఱుంగన యీసందడిలోఁ గాలు దాఁకె ననిన నెరయం దన్ని యెఱుంగ ననినం బోనిచ్చెదనా యనుచు నందంద దట్టించిన నయ్యీడిగ డాకేలి కటారి వలకేల సందుకొని తన్నినాఁడ నేమనియెదవురా యనిన నతని బిఱుసు చూచి బంటుమల్లండు స్రుక్కి యేమియు నే మనియెద దేవర కూడిగంపుబంటుం గాన దోస మనియెద ననియెం గావున.

38


క.

ఆపంతము గాకుండఁగ
నా పేరును నతని పేరు నాణెంబులుగా
మీపిన్నవాండ్ర మమ్మును
జేపట్టి యొకింతవేడ్క సేయింపఁదగున్.

39


వ.

అని మ్రొక్కిన నట యంగపతిభటుండు.

40


ఆ.

మీకుఁ బిన్నవాఁడ నేకాంగవీరుండ
ఱంకెవైచిన నడబింక మైన
నగినఁ గేరడించిన న్మీసలంటినఁ
[1]బట్టి తివియ నాకుఁ బాడిగాదె.

41


ఆ.

నృపులు గవులు భటులుఁ గృపణులు శూరులు
నొక్కచోటఁ గూడియున్నవారు
వీరు మెచ్చ మమ్ము విడిచి మన్నించుట
ఘనత యిదియు మీకు ననుచు మ్రొక్కె.

42
  1. చూడ నిదియు నాకుఁ బాడిగాదె