పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

290


గావించెదఁ బేరికిఁ దగు
లా వించుక కలిగె నేని లటపట లేలా.

29


వ.

అనినం దివియు మనుచు నయ్యిద్దఱుం గప్పిన దుప్పట్లు తొలంగవైచి జిఱ్ఱునం గఠాగంబులు డుస్సిన డగ్గఱంగల తలవరు లెడసొచ్చి పట్టి తొలంగం దిగిచి యీమహోత్సవంబులో నిట్టిగలబలు సేయ మీయట్టిబలుబంట్లకు సందిక్రంతలజగడంబులు వలదని తోడ్కొని చని రత్నమండపముఖశాల యైన కొల్వుమండపంబులో నున్న గోవిందచంద్రుం డనుపడవాలుముందటం బెట్టి యీకలహకంటకుం డంగాధిపతిలెంకతోఁ బోట్లాడఁగ డగ్గఱునెడ మానిపించి యిద్దఱం దోడితెచ్చితి మవధరింపు మనిన నతండును.

30


క.

తగునోయి కలహకంటక
జగడంబులు సేయ నొండు సమయము లేదే
పగపాటి నీకు నితనికిఁ
దగిలిన దీవిందుతో వితండము గలదే.

31


ఆ.

అనుచు నతని దూఱి యాతనిదెసఁ జూచి
యితనితోడ జగడ మేల యయ్యె
ననుడు నతఁడు వలికే నను నితఁ డిప్పుడు
వేసెఁగాన నిట్టివివర మయ్యె[1].

32


క.

ఆపడవాలును దమభటుఁ
గోపించుచుఁ గవుల బాఠకుల శూరుల నా
లోపలఁ గూర్చుండఁగ నిడి
యాపొడి దగంగఁ దీర్పుఁ డని నియమించెన్.

33


సీ.

వారలు నేకాంగవీరుఁడ వ్రేటున
        కైతగిలినవాఁడ వనుచుఁ జూచి

  1. వైచెగాన నిట్టివైరమయ్యె