పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxiv

"విశాలాయాం నందోనామ రాజా మహా శౌర్యసంపన్నో అభూత్ , తస్యచ భానుమతీ నామ మహిషీ. తస్యచ రాజ్ఞః తస్యాం అతిప్రీతిరాసీత్. సింహాసనేపి సహైవ తయా సముపవిశేత్, నిమేషమపి తయా వినా నతిష్ఠేత్"

(విశాలా నగరమున నందుడనురాజు, గొప్పపరాక్రమము గలవాడు. అతని భార్య భానుమతి. ఆ రాజునకు భార్యయందు విశేషప్రీతికలదు. సింహాసనమునందు ఆమెతో కలసియే కూర్చుండును, ఒక నిముషమైన ఆమెను విడిచి ఉండడు.) ఈ అయిదు వాక్యములకు జక్కన 10 పద్యములను వ్రాసెను.

క. ఆ నందమహివల్లభుఁ
   డానంద రసార్ద్ర హృదయుఁడై యేప్రొద్దుం
   దా నగరు వెడలకుండును
   భానుమతీ మోహపాశ బద్ధుండగుటన్.

క. జక్కవ కవ పెక్కువయగు
   మక్కువతో రేయిఁబగలు మనుజాధీశుం
   డక్కాంత దక్కనోర్వక
   దక్కటి కార్యంబు లెల్లఁ దక్కిచరించున్.

శా. ఆ రామామణితోడఁ గూరిమి నతండత్యాస్థఁ గ్రీడించు సం
    సారస్ఫార సుఖైక సార సురతేచ్ఛాపూర నిర్మగ్నుఁడై
    యారామాంతర కేళి పర్వత గుహా హర్మ్యాంతరాళంబులం
    గీరాలాప మదాలిగీత విలసత్క్రీడా నివాసంబులన్.

సీ. ఆత్మావనీమండలాసక్తిఁ బెడఁబాసి
           లతనా నితంబ మండలముఁబొదువు.

వ. అంత బహుశ్రుతుండు