పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

సింహాసన ద్వాత్రింశిక


ధైర్యము సాహసమును నౌ
దార్యమ్మును లేక యెక్కఁదగవే దీనిన్.

109


వ.

అనవుడు నతని సాహసాదికోదారభావంబు లెట్టి వనిన నప్పాంచాలిక సప్రపంచంబుగా ని ట్లని చెప్పం దొడంగె.

110


ఉ.

ఏ మని చెప్పఁ దక్కిన నరేశ్వరు లెవ్వరుఁ గారు గాని నేఁ
డీమహి విక్రమార్కవిభు నీడున కౌదు రమోఘబాణసం
గ్రామమున న్రతి న్విమతఖండన మై బలిమి న్ముఖప్రభన్
రాముఁడుఁ గాముడుం బరశురాముఁడు భీముఁడు సోముఁడుం గదా.

111


ఆ.

అట్టి మనుజవిభుఁడు భట్టి ప్రధానిగా
నయ్యవంతి నేలు నాదినములఁ
గలఁడు వేదవేది ఘనుఁడు ధర్మజ్ఞుఁడు
సుశ్రుతుండు నాఁగ నాశ్రితుండు.

112


ఉ.

సుశ్రుతుఁ డెల్లతీర్థములుఁ జూచెద నంచు దృఢవ్రతస్థుఁడై
యాశ్రితకల్పవృక్ష మగు నాపతిపంపున నేగి ధర్మస
మ్మిశ్రముగా సుదేశములు ముట్టుచుఁ బుణ్యముఁ గూడఁబెట్టుచు
న్విశ్రుత మైనతన్మహిమ నించు వెసం జనియం బ్రయాగకున్.

113


మ.

తరగ ల్చేతులు పక్షిజాతములకూఁత ల్కంకణక్వాణముల్
[1]నురువు ల్తెల్లని చామరంబు లన నన్యోన్యంబు నుప్పొంగుచు
న్సరి గంగాయమునల్ తగం గొలువఁగా ఛాయావటచ్ఛత్రసం
స్ఫురణం జెల్వగు తీర్థరాజ మచటం జొచ్చెం బ్రశంసించుచున్.

114


క.

నీలము ముత్యముఁ గూర్చిన
పోలిక హరిహరులు గూడుపొందున నొకచోఁ

  1. అరుదౌ ఫేనము వెల్లచామరలనన్