పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

283


ఆ.

తఱిమి సామదానదండభేదములలో
నొకట నైన వైర ముడుపవలయుఁ
బగతు రెల్లఁ గూడి పై నెత్తివచ్చిన
నెత్త మాడుచుండ నీతి యౌనె[1].

92


క.

అనవుడు జనవల్లభుఁ డిది
మనచేతల నౌనె [2]దైవమాయాగతమై
చననున్నవి చను నెచటను
మననున్నవి మను జలాగ్నిమధ్యములందున్.

93


క.

వృక్షముననున్న యేగురు
యక్షులు మనరాజ్య మొసఁగ హరియింపఁగ న
ధ్యక్షులు మన కిది పనియే
యక్షంబులు వైవు చాలు నాడుద మబలా.

94


వ.

అని యనంతరంబ తత్కృతస్మరణంబుగాఁ బలికిన మనంబున నెఱింగికొని యయ్యక్షు లక్షణంబ మన మిచ్చిన రాజ్యంబున కుపద్రవంబు పుట్టుచున్నయది యొకయుపాయంబు తర్కింపవలయు నని వచ్చి యాకూడిన రాజులలోఁ బరస్పరవైరంబును మనోవైకల్యంబును బుట్టించిన నాదండు రెండట్టలై.

95


మ.

తమలోఁ బోరుచు నస్త్రఘట్టనసముద్యద్బూరివహ్నిస్ఫులిం
గము లాశాంతములం బిశంగములుగా గావింపగా బాహువి
క్రమముల్ చూపి గజాదిసైన్యములు మ్రగ్గం దోరమై రక్తపూ
రము కెంధూళి నణంపఁగాఁ గడఁగి రారాజన్యు లాజి న్వడిన్.

96
  1. పైవచ్చి విడిసిన యపుడు నెత్తమాడ నర్హమగునె
  2. దైవమతమేగతి యోచన నున్నవి వేగమచను