పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5)

xxxiii

తృతీయాశ్వాసము- 5. భర్తృహరి భార్య చెడువర్తనము వలన విరక్తుడై వనములకు పోయినకథ.

6. బహుశ్రుతుడను మంత్రి కథ (ససేమిరా)

పంచమాశ్వాసము- 7. చిత్రకూటము దగ్గర ఒక ముని ఎన్నో యేండ్ల నుండి హోమము చేయుచున్నను ఫలము కానకున్నందుకు వికమార్కుడు వెళ్ళి కాళికను మెప్పించి అతని కామితము తీర్చిన కథ.

8. విక్రమార్కుడు అశ్వమేధము చేయు సందర్భములో సముద్రుడు పంపిన దివ్యరత్నములను బ్రాహ్మణునకు సమర్పించిన కథ.

9. దేవదత్తుడను బ్రాహ్మణుడు విక్రమార్కునకు కొద్ది సహాయము చేసి ఆతని కృతజ్ఞతా గుణమును పరీక్షించుటకై రాజపుత్రుని దాచి, వానిని చంపినట్లు నటించినను రాజు బ్రాహ్మణుని క్షమించిన కథ.

10. విక్రమార్కుడు కాంచీనగరములో వేశ్యనాశ్రయించిన రాక్షసుని చంపి వేశ్యనుద్దరించి తన పురోహితపుత్రుడు కమలాకరునకు సమర్పించిన కథ.

11. రాక్షసునకు వంతుగా పోవలసిన బ్రాహ్మణ బాలకునకు బదులుగా విక్రమార్కుడు వెళ్ళి రాక్షసుని మెప్పించి, నరభక్షణము మాన్పించిన కథ.

ఈ 11 కథలును సంస్కృత విక్రమార్క చరిత్రము నుండి తీసికొని పెంచినవి. తరువాతి వాడైన గోపరాజు జక్కన విక్రమార్క చరిత్రమును చదివి యుండెను. మూలమును జక్కన - గోపరాజులు ఎట్లు అనుసరించిరో పరిశీలించిన తెలియగలదు. మూలము నందలి 'ససేమిరా ' కథను చూడుడు. సంస్కృతమున 55 గద్యపద్యములలో ఉన్న బహుశ్రుతుని కథను జక్కన 100 గద్యపద్యములకు పెంచగా, గోపరాజు 103 గద్యపద్యములలో చెప్పెను. మూలమున ఈ కథలోని నందరాజు స్త్రీ వ్యామోహము ఇట్లు చెప్పబడినది.