పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

265


చనియెద నని మ్రొక్కి వనిత యేఁగిన రాజు
వెఱఁగంది యిక్కువ వెదకి కాంచి


ఆ.

దీనుఁ డైన భద్రసేనతనూజున
కిచ్చి వేడ్క మగిడి వచ్చెఁ బురికి
నిట్టిగుణము లేక యిది యెక్కవచ్చునే
పొమ్ము చాలు నింక భోజరాజ.

322


క.

అనవుడు నంతకు నంతకు
విన నింపగు నతనితెంపు విని సభ యెల్లన్
మన మలరఁగ నవమానం
బును[1] సిగ్గును ముడివడంగ భోజుఁడు మగిడెన్.

323


శా.

అక్షీణప్రతిపక్షభావసముదగ్రాటోపజాగ్రన్మనో
రక్షోనాయకపక్షతత్క్షణవిహారక్షిప్తకౌక్షేయకుం
గుక్షిన్యస్తసమస్తలోకభరణక్షుణ్ణాక్షయాత్మావృతి
ప్రక్షేపోచితు వాహనీకృతమహాపక్షీశు లక్ష్మీశునిన్.

324


శా.

ఉల్లాసోద్ధతచండతాండవవిహారోత్తుంగరంగజ్జటా
వల్లీమండలమల్లికాకుసుమభావప్రాప్తబాలేందుసం
ఫుల్లేందీవర రేణుసంగకబరీభూతాభ్రకూలంకషా
కల్లోలోపరిబిందుమౌక్తికమయాకల్పోత్తమాంగున్ శివున్.

325


మాలిని.

ధరణిధరవిభూషా ధర్మనిర్మాణతోషా
సరసిజభవసేవ్యా సంతతాత్మీయభావ్యా
నిరుపమనిజలీలా నిత్యకళ్యాణశీలా
పురహరహరిరూపా భుక్తిముక్తిస్వరూపా.

326
  1. ననురాగంబున