పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

భవ్యుఁడు ధర్మశర్మ తనబాంధవవర్గము చెప్పగా మదీ
యవ్యభిచార మట్లెఱిఁగి యాత్మఁ గలంగియు కామినీ నహం
తవ్య[1] యటంచుఁ దెంపుడిగి దానవుచేతికశాహతి న్శరీ
రవ్యథఁ గుందుచుండు బహురాత్రులు నీ వని శాప మిచ్చినన్.

318


క.

వడవడ వడఁకుచు మానము
సడలఁగ ధరఁ జాఁగి మ్రొక్కి శాపావధి యె
న్నఁడు నాకుఁ గలుగు ననుచుం
దడవోర్వమి విన్నవింప దయతో నతఁడున్.

319


క.

అసహాయశూరుఁ డగునొక
వసుధాపతి వచ్చి రేలు వగఁబెట్టెడున
య్యసురఁ బొరిగొన్న యప్పుడ
వెస నీశాపమున కెల్ల వీడ్కో లనియెన్[2].

320


శా.

ఆశాపంబున వీనిబారిఁ బడి దేహం బెల్ల మ్రందంగ న
య్యాశాబంధముపేర్మిఁ బ్రాణములఁ బాయంజాల కే నుండఁగా
నీశస్త్రప్రభ నాతమం బడఁపి మన్నించెం గృపం జూడు భూ
మీశాధీశ్వర! నీకు మే లొకట యే నిచ్చోటఁ గావించెదన్.

321


సీ.

ఇక్కడి గుడి తూర్పుదిక్కునఁ బక్కెచె[3]
        ట్టున్నది దానికి నుత్తరమునఁ
[4]బరువెఁడు దవ్వున బరివెంక పడుమటి
        నెలవునఁ దొమ్మిది నిధుల మీఱి
దనుజుఁడు దాఁచిన ధనము పెక్కున్నది
        కైకొమ్ము నామీఁదఁ గరుణసేయు

  1. ఇంతిదా నహంతవ్య
  2. వెస నీపాపమున కదియె వీడ్కో లరయన్
  3. పరికెచెట్టు (బరివెంకకుఁ బక్కె నామాంతరము. పరికె వృక్షవిశేషము.)
  4. పరువుదవ్వున