పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

243


శా.

సంసారాటవిలోపలం గలవు మత్సామాన్యముల్ వ్యర్థముల్
హింసామూలము లైన జంతువు లసంఖ్యేయంబు లోఖేచరో
త్తంసా నీ కెనయైనవారు గలరే ధర్మాధికు ల్వెంచలో
హంసానీకము లేదుగాక బకభేకౌఘంబు లేకుండునే.

203


క.

మావంటివారి నూర్వురఁ
గావఁగఁ జాలుదువు నీ వొకనిఁ గాచుటకున్
జీవం బిచ్చిన నార్తుల
కేవెరవున బ్రదుకవచ్చు నెడరైన యెడన్.

204


క.

మాకులమువారు విడిచిరి
నీ కీకృప సేయనేల నీచుట్టమనే
శోకమునఁ జావకుండగ
నీకాంతను ముసలిఁ గావు మింతియ చాలున్.

205


చ.

అనవుడు ఖేచరేంద్రసుతుఁ డచ్చెరువంది ఫణీంద్రనందనా
విను మిది యేల నాపనికి విఘ్నము చేసెద వింత కొల మీ
వనమున నర్థి వేఁడమి దివానిశము ల్మదిఁ గుందుచుందు నేఁ
డనఘ పరోపకారసమయం బిటు గల్గిన నుబ్బి వచ్చితిన్.

206


చ.

తనయులు భార్య లన్నలును దమ్ములుఁ జుట్టలు సంగడీండ్రు యౌ
వనము ధనంబు నంచు మది వారక ప్రాణములైన నిచ్చి తా
ననదను నార్తు దీను శరణాగతుఁ[1] గావనివాఁ డజాగళ
స్తన మని యండ్రు వానికి యశంబును ధర్మము నెట్లు చేకుఱున్.

207


ఉ.

లావు భయార్తరక్షణము లాభము పుణ్యము దేహశుద్ధి స
ద్భావము భూషణం బెఱుక ధర్మము సత్కృప ప్రాభవంబు సం

  1. ననద ననాథు నార్తు శరణాగతు