పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

231


క.

అస్తోకంబుగ నత్తా
ళస్తని కుచమండలమున లలనలచే వి
న్యస్త మగుచకదనము నవ
కస్తూరీలేపనంబుకై వడిఁ దోఁచెన్.

140


వ.

అవి యన్నియుం జూచి డగ్గఱ బెగ్గిలి చతురిక న్యాయనిష్ఠురోక్తులఁ జంద్రు నుద్దేశించి.

141


క.

ఉడురాజ నీవు పొడిచిన
జడనిధి యుడుకెక్కి వెక్కసంబునఁ బొంగున్
బడబాగ్ని మీఱి నావుడుఁ
బడఁతుక నీవేఁడిఁ జిమిడిపడ కెట్లుండున్.

142


క.

హరిణాక్షి చూడ్కిఁ గన్నుల
సిరిగోల్పడి యిఱ్ఱి నిన్నుఁ జేరిన నీ వీ
తరుణిఁ దెగఁజూడఁ బోలుదు
పరికింపఁగ నెపుడుఁ బక్షపాతివి గావే.

143


మ.

అమృతాంభోనిధి జన్మభూమి సురభూజైరావతశ్రీసుధా
ప్రముఖంబు ల్తగు తోడఁబుట్టుగు లుమాప్రాణేశుజూటంబు గే
హము బింబం బమృతం బనంగ జగదాహ్లాదంబుగా నిన్నుఁ జూ
తుము నీవేఁడిమి కాలకూటమునకుం దోఁబుట్టు వయ్యెంగదా[1].

144


ఆ.

నాఁడు నేఁడు నీకు నాఁడుఁదోబుట్టువు
లేదా కరుణ లేదు లేశ మైనఁ
బొలఁతిమొగముతోడి పొత్తైనఁ బరికించి
చల్ల సేయుమయ్య చందమామ.

145
  1. దోఁబుట్టువౌటంజుమీ; నౌటంగదా