పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

సింహాసన ద్వాత్రింశిక


మ.

అళులారా యలికుంతలం జెలిమితో నానంద మందింపుఁడీ
చిలుకా చిల్కలకొల్కి నేపక సఖీస్నేహంబు వాటింపుమీ
వలరాజా వలవంత మాన్పుము పికద్వంద్వంబ యీద్వంద్వముం
గలయం గోరుము మారుతా మరలుమీ కన్నంత నిక్కన్నియన్.

134


వ.

అనునప్పు డక్కుమారఖేచరున కైన యత్తాపమునకుం దాప యగు నాదిఖేచరుం డాదిత్యుండు కాంతి సడలినట్టు దిరిగి చని ఘనపుష్పరాశితల్పంబునం దనమేను సేర్చిన.

135


క.

జడనిధి వెలువడి యెఱ్ఱగఁ
బొడమెడు కిరణములు శిఖిలపోలిక నిగుడం
గడగి యుడురాజు విరహుల
బడబానల మనఁగ నుదయపర్వత మెక్కెన్.

136


ఆ.

అంత జగమునిండ నచ్చవెన్నెల పర్వ
నందులోని వేడిఁ గంది కుంది
కాఁగఁబెట్టినయుదకంబులోపల నున్న
మీనువోలె బాల మిడుకఁజొచ్చె.

137


వ.

ఇట్లధికపరితాపంబునం బురపురం బొక్కుచున్న కన్నియం జూచి కళవళించి చెలులు మెత్తన నెత్తుకొని చని గుడువెందపందిరిక్రింద నరవిందతల్పంబుపై నిడి దైవం బేమి దలంచునో యని దానిమేని కట్టావులం గ్రాఁగిన తమ్ము సవరించుకొనుచు.

138


క.

తను నంట నోడి వనజా
ననకును జేమంతిపుప్వునం గొని పన్నీ
రెనయ మెయిఁ బూయుచోఁ గ్రాఁ
గినపెనమున నొలుకు నూనె క్రియఁ జుయికొట్టెన్[1].

139
  1. చుంయనియెన్; చుఱుకంటెన్