పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

229


వ.

అనిన నా రాక్షసి కుతూహలంబున నిట్లనియె.

99


జీమూతవాహనుచరిత్రము

క.

జీమూతవాహుఁ డెవ్వం
డేమి ఘనత[1] చేసి వెలసె నిక్కథఁ దెలియం
గా మనుజాంతక చెప్పుము
నా మనమున హర్షవల్లి నాటుకొనంగన్.

100


వ.

అనుడు నద్దనుజుండు పుణ్యపురుషునియెదురం[2] బుణ్యపురుషకీర్తనం బుచితం బని యిట్లనియె.

101


సీ.

ప్రాలేయగిరిమీఁద భానుబింబద్యుతి
మణిమయప్రాకారమహిమతోడఁ
దిరమైన కాంచనపురములో జీమూత
కేతుఁడు నాఁగ విఖ్యాతయశుఁడు
ఖచరవల్లభుఁ డొకకనకవతీసంజ్ఞఁ
బరఁగెడుకన్యకఁ బరిణయించి
ప్రీతిసంధిల్ల జీమూతవాహుం డనఁ
దగునట్టి పుత్రరత్నంబుఁ బడసి


ఆ.

రాజ్యలక్ష్మిచేతఁ బూజ్యుఁడై కడపట
వార్ధకమున భోగవాంఛ వదలి
నిజపదమునఁ బుత్రు నిలిపి నీతులు సెప్పి
వనితఁ గూడి యేఁగె వనమునకును.

102


క.

జీమూతవాహనుండు మ
హామహిమాఖండలుండు యాచకజనచిం

  1. ఏమితగవు చేసి
  2. పుణ్యపురుషుఁడు వినం బుణ్యపురుష