పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

సింహాసన ద్వాత్రింశిక


క.

ఓరాక్షస నే నొక్కని
బారికినై యడ్డువడితిఁ బరదేశిఁ బ్రియా
హారముగ మెసవు పక్వా
హారంబులు వెనుకవచ్చునంతకు నన్నున్.

93


మ.

అనినం జిత్తములోన దానవుఁడు చోద్యం బందుచు న్నీదుపూ
నినసత్కార్యము సెల్లు మెచ్చితిఁ జుమీ నీకిష్ట మెద్దేని వేఁ
డిన నే నిచ్చెద నావుడుం గరుణదృష్టిం గల్గ నీక్షించి య
జ్జననాథుండు పరోపకారకరణోత్సాహంబుతో నిట్లనున్.

94


క.

ఇప్పుడు నీ వాడినయది
తప్పకుమీ తఱచుగాఁగ దానవులకడం
దప్పును గల వని పెద్దలు
చెప్పుదు రొకచోట సత్యశీలము లేదే.

95


చ.

నయమునఁ బూర్వదేవతలు నాఁగఁ బ్రసిద్ధికి నెక్కె రాక్షసా
స్వయము జగంబులో నసురవంశవిభూషణ[1] మీవు నీవచో
నియమముఁ దప్ప నేరుతువె నీదుకళత్రము సాక్షి గాఁగ నా
ప్రియమును నీవునుం బ్రియము పెంపునఁ జేయుము[2] నిన్ను వేఁడెదఁన్.

96


క.

దనుజేంద్ర నేఁడు మొదలుగ
మనుజాహారంబు గొనుట మానుము కృపతో
జనులకుఁ బ్రియ మొసఁగుచు నీ
వనమున నెలకొనుము వింధ్యవాసిని కెనయై.

97


తే.

అనుడు నవ్వర మిచ్చెదనని తలంచి
ముదితహృదయుఁడై తనయింతిమోముఁ జూచి
యితని సరిపోల్ప నెవ్వరి నెన్నవచ్చు
వనిత యీతఁడు జీమూతవాహుమీఱె.

98
  1. శిరోమణి వీవు
  2. నీదు నప్రియము పెంపును జేకుర