పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

ఏనును బిల్లలుం గలయ నెల్లెడఁ ద్రుళుచు నుల్లసిల్లుచుం
గాననభూమిలోఁ దిరుగఁగా నొక చెం చురు లొడ్డిపోయినం
గానక తూఱుచో మెడలుఁ గాళ్లును జుట్టలుగొన్న దిక్కులన్
దీనులమై కలంగి నలుదిక్కులుఁ జూచుచునున్న యత్తఱిన్.

74


క.

ఫలకుసుమసమిత్పర్ణం
బుల కట చనుదెంచి మమ్ముఁ బొడఁగని కరుణా
కలితుఁ డయి యక్కుమారకుఁ
డలజడిఁ బడకుండఁ ద్రెంచె నయ్యురు లెల్లన్.

75


క.

అతనికృప నిట్లు బ్రతికితి
క్షితి రాఁబులుఁగులకు నెల్ల సేవ్యుఁడనై విం
శతివర్షంబులు పెరిఁగితి
గతి సేసిన యతనికీడు గనుఁగొనవలసెన్[1].

76


క.

తనకుపకారము చేసిన
మనుజునకు న్మేలు గోర మరగక[2] దు:ఖం
బున కడ్డుపడక యుండిన
జనుని బ్రదుకు మేఁకయఱితిచన్నుం బోలున్.

77


క.

రాక్షసిని జంపనోపను
బక్షిని దుర్బలుఁడ నన్ను బ్రతినిధి గాఁగన్
భక్షింపు మనిన మాంస
ప్రక్షీణతఁ జూచి వాఁడు పైఁబడఁ డిటకున్.

78


చ.

అనవుడుఁ దత్ప్రతిక్రియ కుపాయము గానక చింతఁ జెంది యా
తనిఁ దగ నూఱడించి మదిఁ దారుచు వచ్చితి మేము నావుడు

  1. గతిగానక యతనికీడు గనుగొనఁబడియెన్
  2. మేలుఁజేయ మదిగానక