పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

215


క.

బంధురమదాంధదిక్కూ
లంధరగజగండమండల ప్రచలితపు
ష్పంధయనిభనీలిమ జగ
దంధంకరణప్రసార మై తమ మొదవెన్.

58


వ.

తత్సమయంబున.

59


ఆ.

ఆదిమూర్తిక్రియ సహస్రశాఖలను స
హస్రపాదములను నవనిగగన
భాగపూర్ణ మగుచు భవ్యమై ద్విజకుల[1]
సేవ్య మైనతరువుఁ జేరె విభుఁడు.

60


సీ.

ఏమ్రానిమూలంబు లిలకు నాధార మై
        శేషుపడగలతోఁ జెలిమి సేయు
నేవనస్పతికొమ్మ లెక్కి యాడంగ ది
        గంతబాలికలకు నందికోలు
ఏవృక్షమునఁ గల యి రహర్నిశ మంధ
        తమసంబునకు నుండఁ దల్లియిల్లు
ఏపాదపముతుద నెడనెడఁ గాలూఁద
        రవిహయంబులకు విశ్రామభూమి


ఆ.

యేమహీజమునిలు వెల్లపక్షుల కున్కి
పట్టు నాఁగ నెగడి ఫలదళముల
నబ్జరాగమరకతాంచితైకస్తంభ
హర్మ్యసామ్యమందు నట్టివటము.

61
  1. హస్రశిఖర రమ్య మౌచు నెపుడు
    భూమి గగనభాగపూర్ణమై ద్విజకుల-