పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214 సింహాసన ద్వాత్రింశిక


వ.

చొచ్చి యనుష్టుప్ఛందంబునుం బోలె హంసరుతయుతంభై త్రిష్టుప్ఛందంబునుం బోలె భ్రమరవిలసితంబై జగతీచ్ఛందంబునుం బోలెఁ గుసుమవిరిత్రాంబరంబై యతిజగతీచ్ఛందంబునుం బోలె మత్తమయూరసేవితంబై శక్వరీచ్ఛందంబునుం బోలె సింహోద్ధతాశ్రయంబై యతిశక్వరీచ్ఛందంబునుఁ బోలె సుకేసరభాసురంబై యష్టిచ్ఛందంబునుం బోలె హరిణీసంశ్రితంబై ధృతిచ్ఛందంబునుం బోలె మత్తకోకిలాకలితంబై యతిధృతిచ్ఛందంబునుఁ బోలె శార్దూలవిక్రీడితలక్షితంబై కృతిచ్ఛందంబునుం బోలె నుత్పలమాలాయుక్తంబై ప్రకృతిచ్ఛందంబునుం బోలెఁ జంపకమాలాసహితంబై సంకృతిచ్ఛందంబునుం బోలె సరసిజచిహ్నితక్రౌంచపదాంకితంబై[1] యుత్కృతిచ్ఛందంబునుం బోలె భుజంగవిజృంభితసంగతంబై యున్న యవ్వనాంతరంబునం దిరుగునప్పుడు.

54


క.

ఇల నందఱుఁ దను సైరిం
పలే రనుచు వెట్టయైన బ్రదుకొల్లక తాఁ
గలుమడుఁగు లుఱికెనో యన[2]
జలజాప్తుం డస్తశిఖరిచటి దిగబడియెన్.

55


వ.

అప్పుడు.

56


క.

బహుయోజనదూరము లగు
గహనంబుల నుండి యెగసి కలకలములతో
విహగంబులు నిలయమహీ
రుహముల కరుదెంచెఁ బంక్తిరూపం బలరన్.

57
  1. క్రౌంచపదమును సరసిజచిహ్నితమును సంకృతిచ్ఛందములోఁ గనఁబడుచున్నవి. ప్రకృతిచ్ఛందములోని దని వ్రాయబడినది.
  2. దనుసైఁపక
    పలుతెఱఁగుల ననఁగ నట్టిబ్రదుకోర్వకతా
    గెలఁకుల గ్రేళ్ళుఱికెనొ యన