పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము 213


ల్కిన నవుఁ గా దన కూరక
వినవలయును సరసమైన విరసం బైనన్.

47


ఆ.

పలుకఁ దగినపలుకు పలుకక యున్నను
బలుకు వినియు వినని పగిది నున్నఁ
బలుకఁ జూచువానిఁ బలుకకు మన్నను
బలుకులేల తల్లి సొలయు నతని.

48


వ.

కావున.

49


క.

వ్యక్తంబుగఁ జెప్పెద నను
రక్తుఁడ వై విను మవంతిరాజుగుణము నా
యుక్తిం జులుకం జూడకు
యుక్తులయెడ నాఁటదాని యోగ్యత గలదే.

50


మ.

సత్యవచోవిశారదుఁడు, శారదనీరదసంస్ఫురద్యశో
నిత్యుఁడు నిత్యదానగణనీయుఁడు విజ్ఞజనావళీమనో
వృత్యనుసారి సారబలవిక్రమకృత్యుఁడు నాఁగ విక్రమా
దిత్యుఁ డవంతి యేలె నలు దిక్కులరాజులు పంపు సేయఁగన్.

51


వ.

అట్టిమహీపాలుండు షణ్మాసరోజ్యప్రతిపాలనంబును షణ్మాసదేశాంతర వనాంతర ప్రవాసంబును నవశ్యకర్తవ్యం బగుటం జేసి యొక్కసమయంబున రాజ్యం బరాజకంబు గాకుండ భట్టి నుజ్జయిని నునిచి యసహాయశూరుండు గావున నొంటి నిగూఢవేషంబున దేశాంతరనగరగహనవిశేషంబులు చూచుచుం జని చని యొక్కనాఁడు.

62


ఉ.

పణ్యపథంబు భంగి భయభంగము నొందక చొచ్చె దండకా
రణ్యము శైలగర్భితహిరణ్యము తాపసచిత్తనిత్యకా
రుణ్యము గంధబంధురసరోజరజోవనరాజిలక్ష్మణా
గణ్యము[1] పత్రపుష్పఫలగణ్యముఁ బుణ్యజనానుగుణ్యమున్.

53
  1. రజోవనరాజితాజలక్షణ్యము